Nizamabad: పెళ్లికి సిద్ధమైన యువకుడికి గోదావరిలో విషాదాంతం!

Nizamabad: నవీపేట్ మండలం యంచా గోదావరి నదిలో యువకుడు రంజిత్ ఆత్మహత్య. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా, అంతలోనే ప్రాణం తీసుకోవడం స్థానికంగా కలకలం.

K RAVI, BODHAN
Published on: 18 April 2026 1:01 PM IST
Nizamabad
X

Nizamabad: పెళ్లికి సిద్ధమైన యువకుడికి గోదావరిలో విషాదాంతం!

నిజామాబాదు: నవీపేట్ మండల్ యంచా శివారులో గల గోదావరి నదిలో పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ముధోల్ మండలం చించేలి గ్రామానికి చెందిన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఔట్సోర్సింగ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజిత్ గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుండి బంధువుల శుభకార్యానికివెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. శుక్రవారం సాయంత్రం గోదావరిలో మృతదేహం జాలర్లకు లభించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ సమాచారం అందించారు. రంజిత్ అదృష్టమైన విషయం తెలుసుకున్న ఎస్ఐ పోలీస్ స్టేషన్కు వివరాలు పంపడంతో రంజిత్ కు కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి రంజిత్ గా గుర్తించారు. రంజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

వచ్చేనెల 8న వివాహం: గోదావరి నదిలో శవమై తేలిన రంజిత్ వచ్చేనెల 8వ తేదీన వివాహం జరగనున్నప్పటికీ ఇటీవలే కాబోయే నూతన వధూవరులు పెళ్లికి సంబంధించిన షాపింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. అధికారుల ఒత్తిడి మూలంగా ఆత్మహత్యపాల్పడ్డాడా లేక మరే ఇతర కారణాలు రంజిత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందానే అనుమానాలు చెలరేవుతున్నాయి. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story