Malkajgiri: మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టుకు కొత్త జడ్జీలు

Malkajgiri: మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా రాచపూడి శ్రీదేవి, అదనపు జడ్జిగా కె. ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు.

ASHOK, KAPRA
Published on: 17 April 2026 7:12 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టుకు కొత్త జడ్జీలు

Malkajgiri: మల్కాజిగిరి ఫ్యామిలీ కోర్టులో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. హానరబుల్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా రాచపూడి శ్రీదేవి, అదనపు ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా కె. ఉమాదేవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కోర్టు వ్యవహారాలు సమర్థవంతంగా సాగేందుకు తాము సహకారం అందిస్తామని బార్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రత్తయ్య, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు హరికృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు ప్రసన్న, సంయుక్త కార్యదర్శి రవి శంకర్, మహిళా సంయుక్త కార్యదర్శి జలజ, కోశాధికారి పుణ్యరాజు, లైబ్రరీ సెక్రటరీ సాయినాథ్ గౌడ్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా పవన్ కుమార్ బిఎన్, లేడీ రిప్రెజెంటేటివ్‌ సుజాత, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ నవనీత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బద్రీనాథ్, రాకేష్ ఎన్, నరేందర్, నరేష్, శోభా రాణి, విమల తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story