Nizamsagar: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన సానియా.. మండలానికే గర్వకారణం!
Nizamsagar: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మోడల్ స్కూల్ మండలానికే గర్వకారణమని కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.
Nizamsagar: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన సానియా.. మండలానికే గర్వకారణం!
Nizamsagar: నిజాంసాగర్ (కామారెడ్డి)నిజాంసాగర్ మోడల్ స్కూల్ మండలానికి గర్వకారణం అని కామారెడ్డి డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిజాంసాగర్ మోడల్ స్కూల్ లో చదువుతూ విద్యలో విశిష్ట కనబర్చి ఇంటర్ మీడియాట్ ద్వితీయ సంవత్సరం లో 1000/950 మార్కులు సాధించి కళాశాల టఫర్ గా నిలిచింది.
మండలం లోని సుల్తాన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చాంద్ పాషా కుమార్తె సానియా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న మోడల్ స్కూల్ నుండి ఇంతటి మంచి ఫలితాలు రావడం పట్ల ఆ పాఠశాల పటిష్టను మరింత పెంచిందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్రమ శిక్షణ తో కూడిన విద్య విధానం,
విద్యార్థుల పట్టుదల వారి కృషి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని సానియా సాధించిన అద్భుత విజయాన్ని కొనియాడుతూ భవిష్యత్తు లో ఇంక మంచి ర్యాంక్ లు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
టఫర్ గా నిలిచిన సానియాకు ప్రోత్సాహం అందించి శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొని తమ గ్రామం తోపాటు మండల పేరు నిలబెట్టినందుకు గాను సానియాకు శుభాకాంక్షలు తెలిపారు.




