Karimnagar: ఇంధన కొరత లేదు.. సీపీ సీరియస్ వార్నింగ్!
Karimnagar: కరీంనగర్‌లో ఇంధన కొరత లేదని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని, బంకుల్లో తగినంత స్టాక్ ఉందని వెల్లడించారు.
Karimnagar: ఇంధన కొరత లేదు.. సీపీ సీరియస్ వార్నింగ్!
Karimnagar: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎటువంటి కొరత లేదు.
సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దు..
సోషల్ మీడియాలో లేదా ఇతర మార్గాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని కమిషనర్ హెచ్చరించారు.
"ప్రజలు శాంతంగా ఉండాలి. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏవీ లేవు, కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా సీపీ హెచ్చరించారు .




