Congress: న్యూఢిల్లీలో తెలంగాణ మంత్రులను కలిసిన ఎన్ఎస్ యుఐ నాయకుడు!

Congress: తెలంగాణ రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలను ఎన్ఎస్ యుఐ నాయకుడు గొల్ల జాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 10:44 PM IST
Congress
X

Congress: న్యూఢిల్లీలో తెలంగాణ మంత్రులను కలిసిన ఎన్ఎస్ యుఐ నాయకుడు!

కాంగ్రెస్: తెలంగాణ రాష్ట్ర NSUI నాయకుడు గొల్ల జాన్ గారు న్యూఢిల్లీలోని AICC ఇందిరా భవన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాచరణ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు.

ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గౌరవ మంత్రులు సూచించారు. యువత కోసం, విద్యార్థుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని గొల్ల జాన్ ని అభినందించి, పార్టీలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.

మంత్రుల ఆశీస్సులు, మార్గదర్శకత్వం నాకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల సేవే లక్ష్యంగా మరింత నిబద్ధతతో పనిచేస్తాను అన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story