NVSS Prabhakar: బీజేపీలో దుమారం.. NVSS ప్రభాకర్ ఫేస్‌బుక్ పోస్ట్‌పై తీవ్ర చర్చ..!

NVSS Prabhakar: తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. పదవుల కోసం వచ్చే వారు బ్రోకర్లు అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 March 2026 3:36 PM IST
NVSS Prabhakar: బీజేపీలో దుమారం.. NVSS ప్రభాకర్ ఫేస్‌బుక్ పోస్ట్‌పై తీవ్ర చర్చ
X

NVSS Prabhakar: బీజేపీలో దుమారం.. NVSS ప్రభాకర్ ఫేస్‌బుక్ పోస్ట్‌పై తీవ్ర చర్చ

NVSS Prabhakar: తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత చర్చలకు దారితీశాయి. పదవుల కోసం పార్టీకి వచ్చే వారు నాయకులు కాదని, వారు బ్రోకర్లేనని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

ఒకే పార్టీలో కార్యకర్తగా ప్రారంభించి క్రమంగా నాయకుడిగా ఎదిగినవారే నిజమైన నాయకులని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఎదగడం కోసం పార్టీలు మారుతూ పదవులు పొందే వారిని బ్రోకర్లుగా అభివర్ణించారు.

ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఇప్పటికే కొనసాగుతున్న పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. ఆయన పోస్ట్‌పై పార్టీ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story