Madnoor: ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు శిక్షణ

Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ రైతు వేదికలో ఓటర్ల జాబితా సవరణ (SIR)పై జుక్కల్ నియోజకవర్గ అధికారులకు శిక్షణ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 7:36 PM IST
Madnoor
X

Madnoor: ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు శిక్షణ

Madnoor: మద్నూర్ (కామారెడ్డి) "ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ"ను అత్యంత క్షుణ్ణంగా , ఇంటింటికి తిరిగి పరిశీలించి, కొత్త ఓటర్లను చేర్చడం , చనిపోయిన వారిని తొలగించి వివరాలను సరిదిద్దడం వంటి పనులపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మండలం లోని రైతు వేదికలో SIR పై తహసిల్దార్, బి ఎల్ ఒ, సూపర్ వైజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పనులను వేగంగా చేయడానికి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టాలని జిల్లా శిక్షణ అధికారులు తెలిపారు.ఈ శిక్షణ ను జుక్కల్ ఎస్సీ అసెంబ్లీ నియోజక వర్గంలోని తహసిల్దార్, మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణ నిర్వహించినట్లు మద్నూర్ తహసిల్దార్ ఎం డి ముజీబ్ తెలిపారు.

కార్యక్రమం లో పాల్గొన్న అధికారులు.

జుక్కల్ నియోజక వర్గం లోని తహసిల్దార్, మాస్టర్ ట్రైనర్ లకు, బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు, ఆపరేటర్ లకు SIR పై ఒక రోజు శిక్షణ లో భాగంగా తహసిల్దార్ లు వేణు గోపాల్ గౌడ్, ప్రవీణ్, మహేందర్, మారుతి, భుజంగరావు, హేమలత, సత్యనారాయణ, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story