CP Sajjanar: గణేశ్‌ మండపాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి

Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్‌ మండపాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 8 Sept 2026 1:02 PM IST
CP Sajjanar
X

CP Sajjanar: గణేశ్‌ మండపాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి

CP Sajjanar: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసే ప్రతి గణేశ్‌ మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగానే policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో తమ మండప వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

మండపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా అందిస్తే.. ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు కల్పించడానికి వీలవుతుందని తెలిపారు. అలాగే వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసు యంత్రాంగానికి మరింత సులువవుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story