Pawan Kalyan: జనసేనకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డనే.. సాయంత్రం మీడియా ముందుకు పవన్ కల్యాణ్!
Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan: జనసేనకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డనే.. సాయంత్రం మీడియా ముందుకు పవన్ కల్యాణ్!
Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేల నుంచే తమ పార్టీ పోరాట పటిమను వారసత్వంగా పుణికి పుచ్చుకుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు. "అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణ సమాజానికి ఉంది. ఆ లక్షణమే జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉట్టిపడుతుంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమున్నతంగా అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించి, బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ నా పక్షాన అంజలి ఘటిస్తున్నాను" అని పవన్ పేర్కొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు.
ఇదే సమయంలో పోలీసుల ఆంక్షలపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. "ఈ రోజు సాయంత్రం నా నివాసంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తాను. కనీసం దీనికైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




