Pawan Kalyan: ఓరుగల్లులో జనసేనాని.. అనారోగ్యంతో ఉన్న అభిమానికి పరామర్శ!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 17 Jun 2026 10:35 AM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: ఓరుగల్లులో జనసేనాని.. అనారోగ్యంతో ఉన్న అభిమానికి పరామర్శ!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలిసారి వరంగల్ వస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ రాకను పురస్కరించుకుని వరంగల్ పోలీసులు నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన యువ అభిమాని నిరంజన్‌ను ప్రత్యేకంగా కలవనున్నారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అతడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ధైర్యం చెప్పనున్నారు. జనసేనాని తమ ఇంటికి వస్తుండటంతో సదరు అభిమాని కుటుంబంతో పాటు స్థానిక జనసైనికులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

వరంగల్ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయానికి చేరుకోనున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కల్యాణ్ వేద ఆశీర్వచనం తీసుకోనున్నారు.

పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పవన్ పర్యటించే మార్గాల్లో గట్టి నిఘా ఉంచారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story