Peddapalli: నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కొండంత అండ!

Peddapalli: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఉదారత చాటుకున్నారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 19 April 2026 2:50 PM IST
Peddapalli
X

Peddapalli: నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కొండంత అండ!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమర పల్లె గ్రామానికి చెందిన తొట్ల తిరుపతి యాదవ్ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందేందుకు అందజేయాలని గ్రామ సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ద్వారా పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు తెలుపగా ఎమ్మెల్యే స్పందించి రెండు లక్షల ఎల్ వో సి అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నిరుపేదల కోసం ఎలాంటి కష్టం వచ్చిన నేనున్నానంటూ పేదల కష్టాలు తీరుస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ఓదెల మండలం ప్రజల తరఫు తిరుపతి కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ రాచర్ల లింగయ్య, గ్రామ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story