Peddapalli: మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం.. దళారులను నమ్మవద్దు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు.
Peddapalli: మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం.. దళారులను నమ్మవద్దు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ముందుగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ కు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి తో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం కలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. గత ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు ఎదురైన ఇబ్బందులు ప్రజా ప్రభుత్వం లో తలెత్తకుండా ముందుగానే మార్క్ఫెడ్ ద్వారా మొక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. మొక్కజొన్నలకు 2,400 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
రైతులు దళారులను నమ్మకుండా మార్క్ఫెడ్ సెంటర్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. కాల్వ శ్రీరాంపూర్ తో పాటు కూనారం గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మొక్కల కొనుగోలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్క్ఫెడ్ సెంటర్లు ఏర్పాటు చేసి మొక్కజొన్నలను కొనుగోలు చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి 12 ఏళ్లు లో రైతులను పూర్తిగా తొక్కిస్తున్నారన్నారు.
బిజెపి ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచుతున్నామని చెప్పి ధాన్యం కొనుగోల్లో ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. మొక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. గతంలో నేను శాసన సభ్యునిగా గెలిచిన తర్వాత ఏ విధంగానైతే కొనుగోలు చేశామో మళ్లీ అదే రకంగా వరి కొనుగోలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాముడు, ఎంపీడీవో రామ్మోహన్ చారి మండల వ్యవసాయ అధికారి సంధ్య వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




