Petrol: తెలంగాణలో పెట్రోల్ కొరత? బంకుల వద్ద వాహనదారుల క్యూ!

Petrol: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వెలువడుతున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.

Arun Chilukuri
Published on: 27 April 2026 11:10 AM IST
Petrol and Diesel Shortage in Telangana
X

Petrol: తెలంగాణలో పెట్రోల్ కొరత? బంకుల వద్ద వాహనదారుల క్యూ!

Petrol and Diesel Shortage in Telangana: తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్, డీజిల్ కొరత సమస్య వెంటాడుతోంది. చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ దొరుకదన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకు యజమానులే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అధికారులు సూచించింది. బంకుల ద్వారా నిరంతర సరఫరా కొనసాగుతుందని.. ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story