Pilot Rohit Reddy: రోహిత్ రెడ్డి ఎంత ఫేమసో.. ఆయన ఫామ్‌హౌస్ అంతే ఫేమస్
Pilot Rohit Reddy: పైలెట్ రోహిత్ రెడ్డి. మంచి పొలిటికల్ లీడర్‌గా కన్నా.. వివాదాస్పద నేతగానే అందరికీ సుపరిచితులు.
Pilot Rohit Reddy: రోహిత్ రెడ్డి ఎంత ఫేమసో.. ఆయన ఫామ్‌హౌస్ అంతే ఫేమస్
Pilot Rohit Reddy: పైలెట్ రోహిత్ రెడ్డి. మంచి పొలిటికల్ లీడర్‌గా కన్నా.. వివాదాస్పద నేతగానే అందరికీ సుపరిచితులు. పార్ట్‌టైం పొలిటీషియన్‌గా ఉంటే.. ఫుల్‌టైం బిజినెస్‌మెన్‌గా వ్యవహరిస్తుంటారు. ఐతే రాష్ట్ర రాజకీయాల్లో పైలెట్ రోహిత్ రెడ్డి ఎంత ఫేమసో.. ఆయన ఫామ్‌హౌస్ కూడా అంతే ఫేమస్. మొయినాబాద్ పేరు చెప్పగానే.. ముందుగా ఈ లీడర్ ఫామ్‌హౌసే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే దానికి అంత పెద్ద చరిత్ర ఉంది మరి. రెండేళ్ల క్రింత తెలంగాణతో పాటు.. ఢిల్లీ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌కు.. వేదిక ఈ ఫామ్‌హౌసే. కట్ చేస్తే.. మరోసారి అదే వ్యవసాయ క్షేత్రం వార్తల్లో నిలిచింది. కాకపోతే ఈసారి డ్రగ్స్ పార్టీతో.
పార్టీలు, డీలింగ్స్, సెటిల్మెంట్స్తో.. పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే టాక్ నడుస్తోంది. గతంలో రెండు సార్లు ఈ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడులు కూడా జరిగాయి. తాజాగా శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు కావడంతో ఈ ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇల్లీగల్ కార్యక్రమాలకు అడ్డగా మారుతోన్న ఈ ఫామ్ హౌస్ పై సీపీ యాక్ట్ నమోదు చేసి సీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. మొయినా బాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు చేశారు. రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వీకెండ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు పార్టీలో డ్రగ్స్ ను గుర్తించారు. విదేశీ మద్యం బాటిళ్లు, గన్, డ్రగ్స్ ను సీజ్ చేశారు. పార్టీకి అటెండైన 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. వీరిలో అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రోహిత్ రెడ్డి తో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది..
పైలెట్ రోహిత్ రెడ్డి ముందు నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ వస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయన వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి ఆ తరువాత ఆయనకు దూరం అయ్యారు. ఈ క్రమంలో 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్ హౌజ్ లోనే జరిగింది. ఈ వ్యవహారంలో పైలెట్ రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. తనను పార్టీ మారాలని ప్రలోభ పెట్టారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పైలెట్ రోహిత్ రెడ్డిని పలుమార్లు విచారించింది.
2023తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో రోహిత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బెంగళూరు డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైలెట్ రోహిత్ రెడ్డిని విచారించింది. తనకున్న ప్రభుత్వ భద్రతా సిబ్బందితో కలిసి సినిమా స్టైల్లో రీల్స్ చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలంతో పాటు ఆయనకు డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ నేతృత్వం లో సిట్ ఏర్పాటు చేసింది..రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై విచారణ చేయనుంది సిట్..దుబాయి లింకులు , డ్రగ్స్ దందా , నిమిడ్ శర్మ రియల్ వ్యాపారాలపై సిట్ విచారణ జరుగనుంది..పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణ నేపథ్యంలో సోకాజ్ నోటీసులు అధిష్టానం జారీ చేసింది..డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా అదేవిధంగా పోలీస్ కేసు నమోదు అయినా నేపద్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నోటీసులలో పేర్కొన్నారు..ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీసులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి ..ఈ అంశంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని షో కాజు నోటీస్ లలో పేర్కొన్నారు. పార్టీ కి ఇబ్బందులు రాకుండా రిప్లై అనంతరం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఆసక్తి రేపుతోంది. నాడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా వ్యవహరించి బీఆర్ఎస్కు బలం చేకూర్చిన రోహిత్‌రెడ్డి.. ఇప్పుడు అదే ఫామ్‌హౌస్ వేదికగా డ్రగ్స్ కేసులో దొరికి.. అదే గులాబీ పార్టీని ఇరుకున పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న వేళ.. ప్రజా సమస్యలకు, హామీలపై అధికార కాంగ్రెస్‌ను ఎండగట్టాలని బీఆర్ఎస్ బావించింది. కానీ డ్రగ్స్ వ్యవహారంతో మ్యాటర్ ఒక్కసారిగా ఇటు డైవర్ట్ అయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డ్రగ్స్ ఆరోపణలపై మాటల యుద్ధం జరుగుతోంది. ఇది కాంగ్రెస్‌కు అస్త్రంగా మారింది.




