PM Modi: చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రధాని మోదీ.. డిప్యూటీ సీఎంను పరామర్శించిన పీఎం!

PM Modi: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సందడి. జూబ్లీహిల్స్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి ప్రధాని భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 10 May 2026 5:50 PM IST
PM Modi
X

PM Modi: చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రధాని మోదీ.. డిప్యూటీ సీఎంను పరామర్శించిన పీఎం!

PM Modi: తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆదివారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను సందర్శించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న వీరిద్దరి ఇళ్లకు మోదీ స్వయంగా వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోదీ తొలుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి వెళ్లిన ప్రధాని, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు.

పవన్ నివాసం నుంచి ప్రధాని మోదీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు. ఇది మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మరియు తాజా రాజకీయ పరిణామాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మిత్రపక్ష నేతల నివాసాలకు స్వయంగా వెళ్లి పలకరించడం కూటమి నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story