Rudrur: పేదలకు కొండంత అండ.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలో ఆరుగురు బాధితులకు రూ. 1,99,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
Rudrur: పేదలకు కొండంత అండ.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలోని పలువురు బాధితులకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో గల రుద్రూర్ మండల కేంద్రంలో ఖరీదైన వైద్యం చేయించుకుని ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ఆరుగురిని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకుల ద్వారా గుర్తించి చెక్కులను మంజూరు.
వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఖరీదైన వైద్యం అందించాలని లక్ష్యంతో ఎమ్మెల్యే సహృదయంతో చెల్లించి పార్టీలకతీతంగా పేదవారికి చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు. రూ. 1,99 వేల 500 ఈ చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్ ఆధ్వర్యంలో డిసిసి కార్యదర్శి పత్తి రామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి నాగేందర్, కాజా, నరసయ్య, పత్తి నవీన్, నాగరాజులు ఉన్నారు.




