Pebberu: రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు!

Pebberu: పెబ్బేరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు దొడ్ల రాములుపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 7:43 PM IST
Pebberu
X

Pebberu: రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు!

వనపర్తి జిల్లా పెబ్బేరు: నిన్న గొల్లపల్లి, చీరకపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన ప్రెస్ మీట్‌లో బి.ఆర్.ఎస్ నాయకుడు దొడ్ల రాములు (చిరుకపల్లి గ్రామ నివాసి) గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని పేర్కొంటూ, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై మరియు వాటిని ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు సాయి రెడ్డి, పెబ్బేరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుగూరు శివ, మణిదీప్ గౌడ్, శివ, షకీల్, అరవింద్, అఖిల్, నజీర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story