Vikarabad: ఇసుక మాఫియాకు షాక్.. భారీగా పట్టుబడిన నిల్వలు
Vikarabad: పెద్దేముల్ మండలం మదనంతపూర్ తాండ, కొండాపూర్ పరిసరాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 50 ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేశారు.
Vikarabad: ఇసుక మాఫియాకు షాక్.. భారీగా పట్టుబడిన నిల్వలు
Vikarabad: పెద్దేముల్ మండలం మదనంతపూర్ తాండ, కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించి, వాటిని వెంటనే సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన ఇసుకను తదుపరి చర్యల నిమిత్తం రెవేన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా లేదా తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
Next Story




