Medak: మెదక్ పాలిటిక్స్‌లో కాక.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు
Medak: మెదక్ మున్సిపాలిటీలో మారిన రాజకీయ సమీకరణలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్.
Medak: మెదక్ పాలిటిక్స్‌లో కాక.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు
మెదక్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 14. భారత రాష్ట్ర సమితికి 15.బీఎస్పీ ఒకటి. బిజెపి 2 స్థానాలు గెలుచుకున్నాయి కాగా బీఎస్పీ మద్దతు స్థానిక ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలుచుకోవడం జరిగింది దీంతో మున్సిపల్ చైర్ పర్సన్ గా కానుగు రాధిక భూపతిరాజ్. వైస్ చైర్మన్గా దొంతి నరేష్ గౌడ్ ఎన్నికయ్యారు కాగా కోఆప్షన్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రాగి వనజ కొరివి రాములు తాహైర్ నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ నాయకులతో కలిసిమెదక్ కమిషనర్ కు అందజేశారు.
మెదక్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు పోటాపోటీగా ఉన్న తరుణంలో భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు ముగ్గురు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పట్టణ రాజకీయ సమీకరణలు వేడెక్కాయి. కో ఆప్షన్ ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో చేరడంతో. భారత రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ చేరిన వారిలో 13వ వార్డ్ కౌన్సిలర్ చెదల సంధ్యా నవీన్. 22 వ వార్డ్ కౌన్సిలర్.గౌస్ కురేష్ 23 వ వార్డు కౌన్సిలర్ పూసాల మధిబోయిన శృతి సంతోష్ ఉన్నారు మరో కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు త్వరలో జరగబోయే కోఆప్షన్ మెంబర్స్ ఎన్నిక సందర్భంగా చేరికలు జరిగాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.




