Priyanka Gandhi: రేవంత్ రెడ్డికి ప్రియాంక అభినందనలు.. బీజేపీ లోపాలను ఎండగట్టడంలో సక్సెస్!
Priyanka Gandhi: డీలిమిటేషన్ అంశంపై బీజేపీ వైఖరిని ఎండగట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ అభినందించారు.
Priyanka Gandhi: రేవంత్ రెడ్డికి ప్రియాంక అభినందనలు.. బీజేపీ లోపాలను ఎండగట్టడంలో సక్సెస్!
Priyanka Gandhi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నుంచి ప్రశంసలు లభించాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు ఆమె ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానాల్లోని లోపాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రియాంక పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా రాష్ట్రాల నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ, ప్రతిపక్షాల ఐక్యతకు ఆయన చేసిన కృషిని ఆమె కొనియాడారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపి, దాని వెనుక డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ జొప్పించిందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ రాజకీయాన్ని ఎండగట్టడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో అధికార పార్టీ తప్పులను నిరంతరం ఎండగట్టాలని, ప్రజా పక్షాన పోరాడాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకున్నందుకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.




