Prof K Nageshwar: ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ అరెస్ట్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. అసలు విషయం ఇదీ!
Prof K Nageshwar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.
Prof K Nageshwar: ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ అరెస్ట్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. అసలు విషయం ఇదీ!
Prof K Nageshwar: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో జనసేన, కూటమి శ్రేణులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణకు (హైదరాబాద్) చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అరెస్టుకు ఏపీ పోలీసులు వెళ్లారనే వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక 'ఫ్యాక్ట్‌చెక్' (Fact Check) విభాగం పూర్తిగా ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణకు వెళ్లారనడంలో ఎలాంటి నిజం లేదని, అదంతా కేవలం అసత్య ప్రచారమని స్పష్టం చేసింది.
కొందరు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తూ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఈ రకమైన తప్పుడు ప్రచార తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం చేసిన ఈ పోస్టును అధికార తెలుగుదేశం పార్టీ (TDP) సైతం తన అధికారిక హ్యాండిల్ ద్వారా రీపోస్టు చేసింది. దీంతో నాగేశ్వర్ అరెస్ట్ చుట్టూ తిరుగుతున్న రూమర్లకు ఒక్కసారిగా తెరపడినట్లయింది.




