Jagtial: వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు.. ఆధునిక సాగుపై రైతులకు పాఠాలు!

Jagtial: జగిత్యాల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ రైతు గుడి శ్రీనివాసరెడ్డిని అభ్యుదయ రైతుగా సన్మానించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 11:37 AM IST
Jagtial
X

Jagtial: వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు.. ఆధునిక సాగుపై రైతులకు పాఠాలు!

Jagtial: రైతులకు సాంకేతిక జ్ఞానం అందిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త మార్గాలను చూపుతున్న శాస్త్రవేత్తలు… మరోవైపు ఆధునిక పద్ధతులతో ముందంజలో నిలుస్తున్న అభ్యుదయ రైతులు… ఈ రెండు కలిసినప్పుడు వ్యవసాయం మరింత బలపడుతుందనే సందేశం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సదస్సులో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గుడి శ్రీనివాసరెడ్డిని అభ్యుదయ రైతుగా సన్మానించారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు పంటల సాగులో నూతన మెలుకువలు, సమగ్ర సాంకేతిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు ఆధునిక పద్ధతులను అవలంబిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. సన్మానం అందుకున్న శ్రీనివాసరెడ్డి కూడా శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని సహ రైతులకు పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story