Medak: రైతు వేదికలో రసాభాస.. నేతల మధ్య వాగ్వాదం

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత. సర్పంచ్ కృష్ణ గౌడ్ మరియు కాంగ్రెస్ నేత దుర్గారెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం.

G Ashok Reddy, Narsapur
Published on: 15 April 2026 8:03 PM IST
Medak
X

Medak: రైతు వేదికలో రసాభాస.. నేతల మధ్య వాగ్వాదం

Medak: ప్రోటోకాల్ పై రగడ కౌడిపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత, మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల సమావేశంలో రసాభాస ప్రోటోకాల్ పై రగడ చోటుచేసుకున్నాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్ధిద్వాదం.

స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపడటంతో ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు సమావేశ ప్రారంభంలో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీడీవో శ్రీనివాస్ సభా వేదిక పైకి ఆహ్వానించారూ దీంతో సర్పంచ్ కృష్ణ గౌడ్ వేదికపైకి చేరుకోగానే కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి

సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.

స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు.

ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story