CP Sajjanar: 'రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్' ఆఫర్ల వెనుక పెద్ద మోసం.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక!
CP Sajjanar: 'రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్' పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ మోసాలపై నగర సీపీ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
CP Sajjanar: 'రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్' ఆఫర్ల వెనుక పెద్ద మోసం.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక!
CP Sajjanar: సోషల్ మీడియా వేదికగా "రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్" (Rent-a-Boyfriend) పేరుతో వస్తున్న వింత ఆఫర్లు, పోస్టర్ల వెనుక ఒక పెద్ద సైబర్ నేరం దాగి ఉందని నగర సీపీ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతులు, అమ్మాయిలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న ఈ కొత్త డేటింగ్ ట్రాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లలో "1st August Special - 50% OFF", "పర్సనల్ కంపానియన్" అంటూ ₹499 నుంచి ₹4,499 వరకు రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీల ధరల పట్టికను ప్రచారం చేస్తున్నారు. ఇంటర్నెట్ లేదా ఏఐ (AI) ద్వారా సృష్టించిన అందమైన కుర్రాళ్ల ఫోటోలను చూపిస్తూ.. గోప్యత పాటిస్తామని నమ్మిస్తారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో క్యూఆర్ కోడ్లు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు. ఆన్‌లైన్ చాటింగ్‌లో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉంది.
సజ్జనార్ కీలక సూచనలు:
తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారనే దానిపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి.
డిస్కౌంట్ ఆఫర్లు చూసి మోసపోవద్దు, అపరిచిత వ్యక్తులకు ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు.
ఒకవేళ ఈ సైబర్ ట్రాప్‌లో చిక్కుకుంటే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.




