Ramachander Rao: ఖర్గేను తీసేసి యువ నేతను కాంగ్రెస్ అధ్యక్షుడు చేయొచ్చుగా?: రామచందర్ రావు సెటైర్!

Ramachander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 27 July 2026 1:38 PM IST
Ramachander Rao
X

Ramachander Rao: ఖర్గేను తీసేసి యువ నేతను కాంగ్రెస్ అధ్యక్షుడు చేయొచ్చుగా?: రామచందర్ రావు సెటైర్!

Ramachander Rao: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపుతోందని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని రామచందర్ రావు ఆరోపించారు. "యువతకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే నిజమైన ఆలోచన కాంగ్రెస్‌కు ఉంటే, ముందుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను తీసేసి ఒక యువ నాయకుడిని ఎన్నుకోవచ్చు కదా?" అని నేరుగా ప్రశ్నించారు. భాజపా ఇప్పటికే తమ జాతీయ అధ్యక్షుడిగా యువ నాయకుడు నితిన్ నబీన్‌ను నియమించి యువతకు ప్రాధాన్యతనిచ్చిందని ఆయన గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని భాజపా అధ్యక్షుడు ధ్వజమెత్తారు. యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, ఉచిత స్కూటీలు మరియు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు ఏమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story