RTC Strike: కండక్టర్లు లేరు.. టికెట్లు లేవు.. అందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం..!

RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మె: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వినూత్న పరిస్థితి. కండక్టర్లు లేకపోవడంతో అద్దె బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం. పోలీసు బందోబస్తు మధ్య బస్సుల రాకపోకలు.

Arun Chilukuri
Published on: 22 April 2026 4:05 PM IST
RTC Strike
X

RTC Strike: కండక్టర్లు లేరు.. టికెట్లు లేవు.. అందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం..!

RTC Strike: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దపల్లి జిల్లాపై తీవ్రంగా పడింది. రెగ్యులర్ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గోదావరిఖని డిపో నుంచి పోలీసు బందోబస్తు నడుమ అద్దె బస్సులను (Hire Buses) పునరుద్ధరించారు.

టికెట్లు లేవు.. ప్రయాణం ఫ్రీ!

గోదావరిఖని డిపో పరిధిలో నడుస్తున్న అద్దె బస్సుల్లో ప్రయాణికులకు ఒక విచిత్రమైన, సంతోషకరమైన అనుభవం ఎదురవుతోంది. కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బస్సుల్లో టికెట్లు జారీ చేసే వారు కరువయ్యారు. దీంతో సాధారణంగా మహిళలకు అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత పథకం తరహాలోనే, ఇప్పుడు పురుషులు కూడా ఎలాంటి టికెట్ తీసుకోకుండానే ఉచితంగా ప్రమణిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా ఈ బస్సులను నడుపుతున్నారు.

పోలీసుల పహారాలో వాహనాలు:

సమ్మె ఉధృతంగా ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు వచ్చే సమయంలోనూ, ప్రధాన మార్గాల్లోనూ పోలీసు వాహనాలు బస్సులను అనుసరిస్తున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అద్దె బస్సుల ద్వారా సర్వీసులను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story