Peddapalli: కాటారం సభకు తరలిరండి.. ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపు
Peddapalli: ఏప్రిల్ 20న కాటారంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ.
Peddapalli: కాటారం సభకు తరలిరండి.. ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపు
Peddapalli: ఈనెల 20న జరిగే సీఎం సభను కు పెద్దపెల్లి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొంటున్నారని,కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోని పెద్దపల్లి నియోజకవర్గ ంలోని అన్ని మండలాల అన్ని గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో తరలిరావాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్న సందర్భంగా పెద్దపెల్లి నియోజకవర్గ నుంచి ఆరు మండలాలలోని ప్రతి గ్రామం నుండి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, సర్పంచులు, నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సీఎం సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ విజయ రమణారావు కోరారు.




