Bhadradri Kothagudem: భద్రాద్రిలో ఇసుక మాఫియా దాడి.. ఉపసర్పంచ్‌పై దాడి కలకలం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న ఉపసర్పంచ్‌పై మాఫియా దాడి. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

G Ravi, Bhadradri
Published on: 21 April 2026 7:53 AM IST
Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బూర్గంపాడు మండలం గోదావరి నది బ్రిడ్జి కింద అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అడ్డుకునేందుకు వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధిపై దాడి జరిగింది.

సారపాక ఉపసర్పంచ్ కన్నెధార రమేష్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన సమయంలో, ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రతిరోజూ రాత్రి వేళల్లో భారీగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ యంత్రాలు, ట్రాక్టర్లతో నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రజాప్రతినిధిపై దాడి జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story