Armoor: విద్యార్థుల ఆరోగ్యంపై రాజీ పడొద్దు.. సర్పంచ్ ఆదేశం

Armoor: నందిపేట్ మండలం కంఠం గ్రామంలో సర్పంచ్ అజిగిరి సాయినాథ్ ఆకస్మిక తనిఖీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 April 2026 6:06 PM IST
Armoor
X

Armoor: విద్యార్థుల ఆరోగ్యంపై రాజీ పడొద్దు.. సర్పంచ్ ఆదేశం

Armoor: జిల్లా నందిపేట్ మండల పరిధిలోని కంఠం గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నేడు గ్రామ సర్పంచ్ "అజిగిరి సాయినాథ్"ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం మరియు పాఠశాలలోని ఇతర సమస్యలపై ఆయన ఆరా తీశారు.

​నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ముందుగా వంట గదిని పరిశీలించిన సర్పంచ్, విద్యార్థులకు పెడుతున్న అన్నం విద్యార్థులతో కలిసి తిన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ గుడ్లు మరియు పౌష్టికాహారం అందించాలని వంట ఏజెన్సీని ఆదేశించారు. కూరగాయలు తాజాగా ఉండాలని, వంట చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలోని మౌలిక సదుపాయాల కొరతను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, మరియు వర్షాకాలంలో భవనానికి అవసరమైన మరమ్మతుల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ "అజిగిరి సాయినాధ్ " మాట్లాడుతూ.. గ్రామ పిల్లల భవిష్యత్తుకు పునాది ఈ ప్రాథమిక పాఠశాలే. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పంచాయతీ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వ నిధులతో పాఠశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం అందేలా నిరంతరం పర్యవేక్షిస్తాం," అని తెలిపారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, వర్డ్ సభ్యులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story