Kalva Srirampur: గ్రామ రూపురేఖలు మారుస్తాం సర్పంచ్ బంగారి రమేష్ ధీమా
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో సిసి రోడ్డు పనుల శంకుస్థాపన. ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో అభివృద్ధి పనులు.
Kalva Srirampur: గ్రామ రూపురేఖలు మారుస్తాం సర్పంచ్ బంగారి రమేష్ ధీమా
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా): మండల కేంద్రమైన కాల్వశ్రీరాంపూర్లో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణారావు గారి ఆదేశాల మేరకు, ఉపాధి హామీ (NREGS) నిధులతో గ్రామంలోని పలు వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేడు 14వ వార్డులో నూతన సిసి రోడ్డు పనులను సర్పంచ్ బంగారి రమేష్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే విజయరమణారావు గారు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఎమ్మెల్యే చొరవతో మంజూరైన నిధులతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయని, ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




