Hyderabad: పరిశోధనలే భవిష్యత్తుకు పునాది.. వీసీ ఉమేష్ కుమార్

Hyderabad: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర ద్వితీయ సంవత్సర విద్యార్థులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని సందర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 April 2026 7:04 PM IST
Hyderabad
X

Hyderabad: పరిశోధనలే భవిష్యత్తుకు పునాది.. వీసీ ఉమేష్ కుమార్

Hyderabad: శాతవాహన రసాయన శాస్త్ర విభాగ ద్వితీయ సంవత్సర విద్యార్థులు క్షేత్ర పర్యటనకై హైదరాబాదులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో పరిశోధన శాలలను సందర్శించడానికి బయలుదేరారు. ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనపై అవగాహన పెంచుకొని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ముఖ్యంగా రసాయన శాస్త్రంలో పరిశోధనల విశృతి చాలా పెద్దదని దీనివలన వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలియజేస్తూ మరిన్ని మెలుకువలు నేర్చుకోవాలన్నారు.

విద్యార్థులు అధ్యాపకులతో కలిసి హైదరాబాద్ లో తార్నాక సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో పర్యటించి వివిధ రకాల పరిశోధన పద్ధతులను చూసి రసాయన శాస్త్రంలో పదార్థాల అనునిర్మాణము, స్వచ్ఛత, వాటి అయస్కాంత ధర్మాల ఆధారంగా నిర్ణయించే సాంకేతికతను, అను పదార్థాల ద్రవ్యరాశి నిష్పత్తులను గురించి, కృత్రిమ సామాన్య మేధస్సును ఉపయోగించి చేసే పరిశోధనలను, బయోగ్యాస్ ప్లాంట్ల ఉపయోగాల అభివృద్ధి మొదలైన అంశాలపై మెలుకువలు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు డా.ఎం సరసిజ, డా.రాజు, డా.మధు, డా.మల్లారెడ్డి బోధనేతర సిబ్బంది ఖాలిద్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story