Seethakka: టీటీఏ మహాసభల్లో మంత్రి సీతక్క.. సత్కరించిన ఝాన్సీరెడ్డి!

Seethakka: అమెరికాలోని నార్త్ కరోలినాలో నిర్వహిస్తున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన సీతక్కకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి స్వాగతం పలికారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 19 July 2026 8:20 PM IST
Seethakka
X

Seethakka: టీటీఏ మహాసభల్లో మంత్రి సీతక్క.. సత్కరించిన ఝాన్సీరెడ్డి!

సీతక్క: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) మహాసభలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,హెచ్‌జేఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన ఝాన్సీరెడ్డి.అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ తెలుగు భాష,సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో టిటిఏ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు.

అనంతరం మంత్రి సీతక్కతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,ప్రవాస తెలంగాణవారి భాగస్వామ్యం,సామాజిక సేవా కార్యక్రమాలు,రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆత్మీయంగా చర్చించారు.

ఈ మహాసభల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు,టిటిఏ ప్రతినిధులు,సామాజిక,సాంస్కృతిక సంస్థల సభ్యులు,ప్రముఖులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story