Census 2027: సెన్సస్-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం
Census 2027: రాష్ట్రంలో ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Census-2027). మెప్మా మహిళలు, సిబ్బంది తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని పీడీ బి. లీలా రాణి ఆదేశం.
Census 2027: సెన్సస్-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం
Census 2027: మన రాష్ట్రములో 'సెల్ఫ్ ఎన్యుమరేషన్ Census-2027 ప్రారంభం అయిన కారణంగా గౌరవ మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతం లోని పొదుపు మహిళా ద్వారా స్వీయ జన గణన ను ప్రారంభించారు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమారి బి లీలా రాణి.
మెప్మా సిబ్బంది మరియు RP లు. పొదుపు మహిళలు అందరు htts//:se.census.gov.in ద్వార లాగిన్ అయి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకొనవలసినదిగ పీడీ క్రింద విదంగా తెలియజేశారు.
1. సదరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయు ప్రక్రియలో భాగంగా ఒక ఐడి నెంబరు SE తో జనరేట్ అవుతుందని. దాని తేది: 01.05.2026 నుండి జరుగు Census-2027 సర్వేకి వచ్చు సిబ్బంది చెప్పుటకు వీలు కలుగుతుందని చెప్పారు.
2. కావున మన పురపాలక సంఘములలో పనిచేస్తున్న సి ఎమ్ ఎం లు, సిఓ లు, ఆర్పీ లు TLF / SLF లీడర్స్ మరియు పొదుపు సంఘం సభ్యులు వున్న అందరు కూడా తప్పని సరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోనవలసినదిగ ఆదేశించడమైనది తెలిపారు.
3. ఎట్టిపరిస్తితులలో తేది 19.04.2026 మరియు 20.04.2026 లలో "సెల్ఫ్ ఎన్యుమరేషన్" అందరు తప్పని సరిగా చేసుకొని సదరు ID లను బుక్ లో నోట్ చేసుకొని తదుపరి ఒక్కొక్క ఆర్పీ రోజు Co కి తెలియజేయని చెప్పారు .
4. దీనిపై రోజువారి టెలికాన్ఫరెన్స్ మరియు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపియున్నారు. కావున Census-2027 చాల సున్నితమైనది గా భావించి దీనిపై శ్రద్ధ వహించి పని పూర్తి చేయవలసినదిగా ఆదేశించడమైనదని కోరారు.




