Suryapet: సూర్యాపేటలో షాబాద్ హంతకుడి ఆచూకీ.. స్పాట్‌కు బయలుదేరిన స్పెషల్ పోలీస్ టీమ్స్!

Suryapet: షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 13 July 2026 12:07 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో షాబాద్ హంతకుడి ఆచూకీ.. స్పాట్‌కు బయలుదేరిన స్పెషల్ పోలీస్ టీమ్స్!

Suryapet: షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్న ఘోర హత్యల నిందితుడు రాజ్‌కుమార్ సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో సూర్యాపేట వ్యాప్తంగా తీవ్ర అలజడి రేగింది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ సూర్యాపేటలోనే సంచరిస్తున్నాడనే బలమైన అనుమానాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డీసీపీ నేరుగా సూర్యాపేట ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, నిందితుడి కదలికలపై చర్చించారు. నిందితుడిని ఎలాగైనా బంధించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని, గాలింపు తీవ్రతను మరింత పెంచాలని ఆదేశించారు.

అత్యంత ప్రమాదకరమైన ఈ హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు భారీ కసరత్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కనుగొన్న వారికి లేదా అతని గురించి సరైన సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నజరానా (క్యాష్ రివార్డ్) అందించనున్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం సూర్యాపేట జిల్లా మరియు దాని పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగడంతో మరికొద్ది సేపట్లోనే హంతకుడు పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితుడి అరెస్ట్ కోసం స్థానికులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story