Shamirpet: పోగొట్టుకున్న ఫోన్లు కావాలా.. CEIR లో ఫిర్యాదు చేయండి
Shamirpet: షామిర్‌పేటలో పోలీసుల మెరుపు దర్యాప్తు. CEIR పోర్టల్ ద్వారా 20 దొంగిలించబడిన ఫోన్ల రికవరీ.
Shamirpet: పోగొట్టుకున్న ఫోన్లు కావాలా.. CEIR లో ఫిర్యాదు చేయండి
Shamirpet: షామిర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ చోరీలు, పోగొట్టుకునే ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండు నెలల కాలంలో నమోదైన 32 ఫిర్యాదులపై CEIR ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ నిర్వహించి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా జవహర్‌నగర్ డివిజన్, మల్కాజిగిరి జోన్ ఏ సి పీ కె. చక్రపాణి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే బాధితులు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. సకాలంలో సమాచారం అందిస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయడం సాధ్యమవుతుంది. ప్రజలు తమ వస్తువులపై అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.
ఈ క్రమంలో పోలీసులు 20 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేసి, షామిర్‌పేట సి ఐ ఎస్. శ్రీనాథ్, అడ్మిన్ ఎస్ఐ జి. సోమి రెడ్డి సమక్షంలో బాధితులకు అందజేశారు. తమ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




