Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. 20 మంది మహిళా ప్రయాణికుల అరెస్ట్!
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి, పోలీసులకు అప్పగించారు.
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. 20 మంది మహిళా ప్రయాణికుల అరెస్ట్!
Hyderabad: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో భారీ వీసా మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం రేపింది.
బాధిత మహిళలంతా హైదరాబాద్ నుంచి మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ముందు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అధికారులు వారి పాస్‌పోర్ట్‌లు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో సదరు మహిళలు చూపిస్తున్న మస్కట్ వీసాలపై అధికారులకు తీవ్ర అనుమానం వచ్చింది. సాంకేతిక తనిఖీల అనంతరం ఆ 20 వీసాలు నకిలీవి (Fake Visas) అని అధికారులు నిర్ధారించారు.
వీసాలు ఫోర్జరీవని తేలడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు తక్షణమే స్పందించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులైన 20 మంది మహిళలను పోలీసులకు అప్పగించారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
వీరికి ఈ నకిలీ వీసాలను ఎవరు సమకూర్చారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ ఏజెంట్ల ముఠా ఏది? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అమాయక మహిళలను నమ్మించి విదేశాల పేరుతో మోసం చేసిన దళారుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.




