Armoor: మహిళా బిల్లుకు మద్దతుగా ఆర్మూర్‌లో సంతక సేకరణ
Armoor: ర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో 'నారీ శక్తి అభియాన్' నిర్వహించారు.
Armoor: మహిళా బిల్లుకు మద్దతుగా ఆర్మూర్‌లో సంతక సేకరణ
Armoor: భారతీయ జనతా యువమోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్ ఆధ్వర్యంలో నారీ శక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళ సాధికారత బిల్ అయినటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో సంతక సేకరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మరియు బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా చట్టసభలలో కూడా ముందుండాలని ప్రత్యేక స్థానం కల్పించాలని ఉద్దేశంతో ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును అమలు పరచడం జరిగింది.
ఈరోజు చూస్తే మహిళలకు ప్రత్యేక స్థానము కల్పిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ పార్టీని ఎందుకంటే ఈరోజు ఒక మహిళను రాష్ట్రపతిగా కూడా మా బిజెపి ప్రభుత్వమే వారికి అవకాశం కల్పించిందని రాబోయే రోజులలో మరింత మహిళలు ముందుకు వెళ్లాలని ఉద్దేశంతో వారికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ తేవడం జరిగిందని వారు మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు భరత్ మరియు ఉపాధ్యక్షులు మనీష్, చరణ్ గౌడ్ కార్యదర్శి పవన్ శ్రీకాంత్ మరియు ధనుంజయ్ బిజెపి ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మరియు అరుణ్, బిజెపి బిజెవైఎం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొనడం జరిగింది.




