Singareni: పరిహారం చెల్లింపులో వివక్ష వద్దు సింగరేణి అధికారులకు హెచ్చరిక

Singareni: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌ వద్ద సింగరేణి ఓబి పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 19 April 2026 6:30 PM IST
Singareni
X

Singareni: పరిహారం చెల్లింపులో వివక్ష వద్దు సింగరేణి అధికారులకు హెచ్చరిక

Singareni: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ వద్దగల సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా జరుగుతున్న ఓబి మట్టి పనులను రాజాపూర్ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. సింగరేణి సంస్థ విస్తరణకు 500 ఎకరాల భూమిని తీసుకుందని భూ నిర్వాసితులు అన్నారు.

గతంలోనే సింగరేణి అధికారులు ఇండ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఆర్ టి హెచ్, ఆర్ పి ఎం నెంబర్లు వేశారన్నారు. పరిహారం చెల్లించే సమయంలో ఆర్ టి హెచ్ నెంబర్లు గల ఇండ్లకు నష్టపరిహారం చెల్లించలేమని ఆర్పిఎం నెంబర్లు ఉన్న వాటికే మాత్రమే చెల్లిస్తామని సింగరేణి అధికారులు చెప్తున్నారని భూ నిర్వాసితులు తెలిపారు.

దీంతో ఇండ్లున్న భూ నిర్వాసితులు చాలామంది నష్టపోతున్నారని ఒకే విధమైన నష్టపరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కనికరించిన అధికారులు మాత్రం స్పందించడం లేదని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భూ నిర్వాసితుల సింగరేణి అధికారులను హెచ్చరించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story