Sircilla: పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.. వేతనాల పెంపు కోసం సమ్మె!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా లో పాలిస్టర్ కూలి పెంపు కోరుతూ ఏప్రిల్ 20 సోమవారం రోజున వస్త్ర పరిశ్రమ బంద్‌కు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది.
Sircilla: పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.. వేతనాల పెంపు కోసం సమ్మె!
Sircilla: ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవనంలో తంగళ్ళపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం అనంతరం ఏప్రిల్ 20 సోమవారం రోజున జరప తలపెట్టిన ఒకరోజు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బందు, దీక్ష కార్యక్రమాల విజయవంతం కొరకు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు హాజరై మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు జరిగే దీక్ష లో తంగళ్ళపల్లి లోని పవర్లూమ్ కార్మికులు , వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులు ఆసాములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
యజమానులు కార్మికులకు ఆసాములకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా యజమానులకు కూలి పెంచకుండా కార్మికులకు నష్టం చేస్తున్నారని లేబర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు
ప్రస్తుతం నిత్యవసరపు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన చాలీచాలని వేతనముతో కార్మికులు రెండు పూటలా సరి అయిన భోజనం కూడా తినలేని పరిస్థితి వచ్చిందని యజమానులు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏప్రిల్ 20 సోమవారం ఒకరోజు సమ్మె దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని యజమానులు కూలి పెంచకుండా కాలయాపన చేస్తే నిరవధిక సమ్మెకు కూడా వెళ్లడానికి కార్మికులు అందరూ సిద్ధం కావాలని అన్నారు దీక్ష రోజున కార్మికుల , ఆసాముల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు*
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్ , పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తంగళ్ళపల్లి అధ్యక్షులు కుడిక్యాల కనుకయ్య , సామల నర్సయ్య , అవధూత హరిదాసు , సామల విష్ణు , రాంనారాయణ , శ్రీశైలం , ప్రకాష్ , రమేష్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు.




