Tandur: శ్రీరామ నామస్మరణతో పులకించిన తాండూరు!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులోని ఇందిరా నగర్‌లో శ్రీరామ మందిర విగ్రహ పునర్ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 6:50 PM IST
Tandur
X

Tandur: శ్రీరామ నామస్మరణతో పులకించిన తాండూరు!

తాండూరు/వికారాబాద్: తాండూరు పట్టణం ఇందిరా నగర్‌(రాంనగర్‌)లో సోమవారం రామ మందిర దేవాలయంలో సీతారాముల విగ్రహా పునర్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని తాండూరు పట్టణం భద్రేశ్వర చౌరస్తా నుంచి సీతారాముల మూల విరాట్ విగ్రహాల ఊరేగింపు చేపట్టారు. పట్టణంలోని పలు పురవీధుల్లో స్వామి వార్ల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. ఊరేగింపు ముందు బాజ భజంత్రీలు, కీర్తనల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సాయిమేధా పాఠశాల విద్యార్థులు పాల్గొని ఊరేగింపులో అడుగుల భజన, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాములను కీర్తిస్తూ కీర్తనలు ఆలాపించారు. వీధుల గుండా సీతారాముల ఊరేగింపు దేవాలయానికి చేరుకుంది. మరోవైపు సీతారాముల విగ్రహా ప్రతిష్టాపన సందర్బంగా దేవాలయంలో ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గోపూజ, హోమం, మంగళహారతి వంటి తదితర పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. బుధవారం దేవాలయంలో సీతారాములు, లక్ష్మణ, హనుంతుడు విగ్రహాలతో పాటు ధ్వజస్థంభ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటి సభ్యులు తెలిపారు.

27వ తేది వరకు కొనసాగే ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను జయప్రదం చేయడంతో పాటు స్వామి కృపపాత్రులు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story