Vikarabad: ఆస్తికోసం తండ్రిని చంపాలనుకున్న కొడుకు!

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాలో ఆస్తి గొడవలు పెను విషాదాన్ని నింపాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 12:09 PM IST
Vikarabad
X

Vikarabad: ఆస్తికోసం తండ్రిని చంపాలనుకున్న కొడుకు!

Vikarabad: వికారాబాద్ జిల్లాలో ఆస్తి తగాదాలు పెను విషాదాన్ని నింపాయి. తన తల్లి ఆస్తి కోసం తండ్రిని , సర్పంచ్ అయినటువంటి పిన్నిని, తమ్ముడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఘటన పరిగి మండలంలో కలకలం రేపుతోంది.పరిగి మండలం రూప్ సింగ్ తండాలో ఆస్తి గొడవలు ప్రాణం తీసే స్థాయికి చేరుకున్నాయి. నిందితుడు తన తల్లికి చనిపోవడంతో తన తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు, తల్లి పేరు మీద ఉన్న భూమి తన పేరుపై చేయాలని తల్లి చనిపోయినప్పుడు వచ్చిన ఐదు లక్షల రూపాయల తనకు ఇవ్వాలని తండ్రితో గొడవ కు దిగాడు. ఇవ్వను అనడంతో పగ పెంచుకున్న మొదటి భార్య కొడుకు నిన్న అర్థరాత్రి దాటాక, సుమారు 1 గంట సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తుండగా.. నిందితుడు అత్యంత కిరాతకంగా ఇంటి పైకి ఎక్కాడు.

ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి తాళలేక బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో పిన్ని, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని (మొదటి భార్య కుమారుడు) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై తండావాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story