Shravana Masam: శ్రావణమాసం శివాలయాల్లో ప్రత్యేక పూజలు!
Shravana Masam: శ్రావణమాసం సందర్భంగా ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడ శివాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు.
Shravana Masam: శ్రావణమాసం శివాలయాల్లో ప్రత్యేక పూజలు!
Shravana Masam: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడ గ్రామాల శివారులో స్వయంభువుగా వెలిసిన లింగమూర్తి ఆలయంలో సోమవారం గ్రామస్తులు రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రుద్రాభిషేకం అనంతరం శివుడికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసంలో శివుడిని భక్తితో పూజిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యయోగాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నర్సింహులు, సబితా గోవర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ శివకుమార్, మాజీ సర్పంచ్ జయమ్మ సుదర్శన్, ప్రజా భువనేశ్వర్, మహేశ్వర్, విజ్ఞేశ్వర్, జగదీశ్వర్, వెంకటయ్య,రమణందన్‌గౌడ్, మల్లిహారున్,వెంకటయ్యగుప్తా, శ్రీనివాస్‌గుప్తా,రామచంద్రగుప్తా, సురేష్,పురుషోత్తం, నరసింహులు, సత్యనారాయణ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.




