కిసాన్ నగర్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. కళ్యాణ రామ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం..!

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పరిధిలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ రామ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

Arun Chilukuri
Published on: 27 March 2026 11:50 AM IST
కిసాన్ నగర్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. కళ్యాణ రామ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం..!
X

కిసాన్ నగర్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. కళ్యాణ రామ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం..!

బాల్కొండ (నిజామాబాద్ జిల్లా): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పరిధిలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ రామ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు.

పోటెత్తిన భక్తజనం - ప్రముఖుల దర్శనం:

శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కళ్లారా వీక్షించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TSMDC) చైర్మన్ ఈరవత్రి అనిల్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

57 ఏళ్ల ఆధ్యాత్మిక వైభవం:

ఈ సందర్భంగా టీఎస్‌ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. గత 57 ఏళ్లుగా ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని కొనియాడారు. 51వ వార్షికోత్సవ వేడుకలకు హాజరవ్వడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రోజురోజుకూ ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ, భవిష్యత్తులో మరింత దేదీప్యమానంగా వెలుగుగొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story