Traffic Restrictions: హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. రేపు 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!

Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 26 March 2026 5:31 PM IST
Traffic Restrictions
X

Traffic Restrictions: హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. రేపు 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!

Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఇతర మార్గాలకు మళ్లించనున్నారు.

శోభాయాత్ర సాగే మార్గం ఇదే..

సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే ఈ మహా శోభాయాత్ర.. మంగళ్‌హాట్, ధూల్‌పేట్, బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్ మీదుగా కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. యాత్ర సాగే సమయంలో ఈ ప్రధాన రహదారులపై సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు.

ప్రధాన మళ్లింపులు (Diversions) ఇలా:

ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పోలీసులు చేపట్టిన మళ్లింపు చర్యలు ఇవే.. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ మీదుగా డైవర్ట్ చేస్తారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్ మరియు సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా పంపిస్తారు. అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి ప్రధాన రోడ్ల వద్ద శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

రద్దీగా ఉండే ప్రాంతాలు

బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి మరియు కాచిగూడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story