Siddipet: వైభవంగా సీతారాముల శోభాయాత్ర.. కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
Siddipet: సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం.
Siddipet: వైభవంగా సీతారాముల శోభాయాత్ర.. కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
Siddipet: తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో బుధవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులను ఎంతో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న దంపతులు కళ్యాణంలో కూర్చొని ఆశీర్వాదాలు పొందారు. సీతారాముల దివ్య కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు.
ఈ సందర్భంగా పండితులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విశిష్టతను వివరించారు. సీతారాముల కల్యాణం నిర్వహించడం వలన కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని, గ్రామంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం పెరుగుతాయని తెలిపారు. సాయంత్రం శ్రీ సీతారాముల శోభాయాత్ర ఆశేష భక్త జనుల మధ్య వైభవంగా జరిగింది.. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.




