Kataram: రైతు భరోసా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. మంత్రి శ్రీధర్ బాబు

Kataram: కాటారంలో జరగనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమంపై మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 18 April 2026 5:06 PM IST
Kataram
X

Kataram: రైతు భరోసా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. మంత్రి శ్రీధర్ బాబు

Kataram: పెద్దపల్లి జిల్లా మంథని లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల తో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమం ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,గౌరవ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story