Kamareddy: కామారెడ్డిలో కుక్కల బీభత్సం: ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు!

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్ పల్లిలో కుక్కల బీభత్సం. ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల హర్షిని, 16 నెలల జాహ్నవిలపై వీధికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 March 2026 5:38 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో కుక్కల బీభత్సం: ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు!

దోమకొండ (కామారెడ్డి జిల్లా): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిధిలోని చింతామన్ పల్లి గ్రామంలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు అన్మకమ్మగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఒక కుక్క అత్యంత దారుణంగా దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.

సంఘటన వివరాలు:

గ్రామానికి చెందిన 5 సంవత్సరాల వయసుగల హర్షిని, కేవలం 16 నెలల వయసున్న పసికందు జాహ్నవి ఆదివారం తమ ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన వీధికుక్క చిన్నారులపై విరుచుకుపడింది. కుక్క దాడిలో చిన్నారుల ముఖం, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. చిన్నారి జాహ్నవికి అత్యంత సున్నితమైన ముఖ భాగంలో లోతైన గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

హైదరాబాద్‌కు తరలింపు:

పిల్లల అరుపులు విని స్థానికులు పరుగున వచ్చి కుక్కను తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన హర్షిని, జాహ్నవిలను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారులను హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ఘటనతో చింతామన్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీధికుక్కల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, తమ పిల్లల ప్రాణాలు పోతుంటే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story