Kalluru: మంత్రి పొంగులేటి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
Kalluru: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కల్లూరు డివిజన్ పర్యటన నేపథ్యంలో సబ్ కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.
Kalluru: మంత్రి పొంగులేటి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారి చేత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, గౌరవ సబ్ కలెక్టర్ గారు నారాయణపురం గ్రామం (కల్లూరు మండలం)లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మరియు పెనుబల్లి మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన సబ్ కలెక్టర్ గారు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమం నిరాటంకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సబ్ కలెక్టర్ గారు స్పష్టం చేశారు.




