Karimnagar: రాజకీయ కనుమరుగు తప్పదు.. జీవన్ రెడ్డికి వార్నింగ్!
Karimnagar: కరీంనగర్‌లో రాజకీయ మాటల యుద్ధం. జీవన్ రెడ్డికి దొర అహంకారం వంటబట్టిందని మండిపడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
Karimnagar: రాజకీయ కనుమరుగు తప్పదు.. జీవన్ రెడ్డికి వార్నింగ్!
కరీంనగర్: పార్టీ ఫిరాయించగానే జీవన్ రెడ్డికి దొర అహంకారం వంట పట్టిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంను వ్యక్తిగత దూషణకు దిగడం సమంజసం కాదని మండిపడ్డారు. మెదడు లేదని అనే మాటలు ఆయనకు మెదడు ఎక్కడుందో ఆలోచించుకోవాలని సూచించారు. మేము తలుచుకుంటే మా కార్యకర్తలు నిన్ను రోడ్లపై తిరగనియ్యమన్నారు.
40 ఏళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మారి సంవత్సరాలు కాలేదని నీ పరిస్థితి ఏందో రాబోవు రోజుల్లో కనిపిస్తాదన్నారు. రాబోవు రోజుల్లో నీకు రాజకీయ మనవడే కనుమరుగవుతుందని ఇతవు పలికారు.
ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీది కాదని కేవలం నీకు పదవి రాలేదనే అక్కసుతో పార్టీ మారి కెసిఆర్ మెప్పు కోసం మా ముఖ్యమంత్రి పై అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు. నాడు కెసిఆర్ పై దుర్భాషలాడి నేడు కెసిఆర్ కు గులాబీలు చేయడానికి వెళ్లడం నీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వాలకం అందుకే జుట్టు అందకుంటే కాళ్లు పట్టే రకమని అందుకే ఆయనను పక్కన పెట్టిందన్నారు. నీకు సమచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం మాట ఇచ్చిన కేవలం దొర దగ్గర గులాబీలు చేయడం కోసమే ఇంకా ఏదో ఆశించి వెళ్లినావు నీకు భంగపాటు తప్పదని అన్నారు.
మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు.




