Narsapur: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే సునీతా రెడ్డి ధ్వజం
Narsapur: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రి సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narsapur: మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే సునీతా రెడ్డి ధ్వజం
Narsapur: "మంత్రి పదవిలో ఉండి బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ను చెప్పుతో కొడతాను అనడం భావ్యమేనా అంటూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ మంత్రి సీతక్క శాఖలో అంగన్వాడీలకు సెల్ ఫోన్ల విషయంలో సుమారు 30 కోట్ల అవినీతి జరిగిందని సాక్షాలతో సహా సోషల్ మీడియాలో బయట పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇందుకు గాను కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించడం దారుణం అన్నారు. ప్రభుత్వంపై, శాఖలపై అవినీతి ఆరోపణలు వస్తే ఎంక్వయిరీ వేయాలని, లేదా దానిని ఖండించాలని అంతేగాని కక్షపూరితంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు.
ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేయలేదా అని ప్రశ్నించారు. చేతకాని ప్రభుత్వమని మంత్రులే బహిరంగంగా మాట్లాడుతున్నారని, ప్రజలు ప్రశ్నిస్తే తప్పేంటనీ ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.
ఏదైనా అంటే గిరిజన మహిళను అంటూ చెప్పుకునే మంత్రి సీతక్క నేడు ఎస్సీ నాయకుడు క్రిశాంక్ ను అనడం భావ్యమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.




